Tuesday, April 14, 2009

ప. పరమాత్ముడు వెలిగే ముచ్చట
బాగ తెలుసుకోరే

అ. హరియట హరుడట సురులట నరులట
అఖిలాండ కోటులటయందరిలో (ప)

చ. గగనానిల తేజో-జల భూ-మయమగు
మృగ ఖగ నగ తరు కోటులలో
స-గుణములో వి-గుణములో సతతము
సాధు త్యాగరాజాదియాశ్రితులలో (ప)
ప. సమయము తెలిసి పుణ్యములార్జించని
కుమతి ఉండియేమి పోయియేమి

అ. శమత తోడి ధర్మము జయమే కాని
క్రమముతో మనవిని వినవే ఓ మనసా (స)

చ1. సారమౌ కవితల విని వెర్రివాడు
సంతోషపడియేమి పడకేమి
చేరెడేసి గుడ్డి కన్నులు బాగుగ
తెరచియేమి తెరవకుండిననేమి (స)

చ2. తురక వీథిలో విప్రునికి పానక పూజ
నెరయ జేసియేమి సేయకుండియేమి
ధరనీని ధన కోట్లకు యజమానుడు
తా బ్రతికియేమి దయ్యమైననేమి (స)

చ3. పదము త్యాగరాజ నుతునిపై కానిది
పాడియేమి పాడకుండిననేమి
ఏదను శ్రీరామ భక్తియు లేని నర జన్మ-
మెత్తియేమి ఎత్తకుండిననేమి (స)
ప. యజ్ఞాదులు సుఖమనువారికి సము-
లజ్ఞానులు గలరా ఓ మనసా

అ. సు-జ్ఞాన దరిద్ర పరంపరు-
లసుర చిత్తులు జీవాత్మ హింస గల (య)

చ. బహు జన్మంబుల వాసన యుతులై
అహి విష సమ విషయాకృష్టులై
బహిరాననులై త్యాగరాజు
భజియించు శ్రీ రాముని తెలియక (య)
ప. మనసు స్వాధీనమైనయా ఘనునికి
మరి మంత్ర తంత్రములేల

అ. తనువు తాను కాదనియెంచు వానికి
తపసు చేయనేల దశరథ బాల (మ)

చ1. అన్ని నీవనుచుయెంచిన వానికి
ఆశ్రమ భేదములేల
కన్ను కట్టు మాయలనియెంచు వానికి
కాంతల భ్రమలేల దశరథ బాల (మ)

చ2. ఆజన్మము దుర్విషయ రహితునికి
గతాగతమికయేల
రాజ రాజేశ నిరంజన నిరుపమ
రాజ వదన త్యాగరాజ వినుత (మ)
ప. రానిది రాదు సురాసురులకైన

అ. పోనిది పోదు భూ-సురులకైన (రా)

చ. దేవేంద్రునికి సు-దేహము పూర్వ
దేవులకమృతమభావమే కాని
ఆ వన చర బాధలా మునులకే కాని
పావన త్యాగరాజ భాగ్యమా శ్రీ రామ (రా)
ప. జగదానంద కారక
జయ జానకీ ప్రాణ నాయక

అ. గగనాధిప సత్కులజ రాజ రాజేశ్వర
సు-గుణా-కర సుర సేవ్య భవ్య దాయక
సదా సకల (జ)

చ1.అమర తారక నిచయ కుముద హిత
పరిపూర్ణానఘ సుర సుర భూజ
దధి పయోధి వాస హరణ
సుందరతర వదన సుధా-మయ వచో-
బృంద గోవింద సానంద
మా-వరాజరాప్త శుభ కరానేక (జ)

చ2. నిగమ నీరజామృతజ పోష-
కానిమిష వైరి వారిద సమీరణ
ఖగ తురంగ సత్కవి హృదాల-
యాగణిత వానరాధిప నతాంఘ్రి యుగ (జ)

చ3. ఇంద్ర నీల మణి సన్నిభాపఘన
చంద్ర సూర్య నయనాప్రమేయ
వాగీంద్ర జనక సకలేశ శుభ్ర
నాగేంద్ర శయన శమన వైరి సన్నుత (జ)

చ4. పాద విజిత మౌని శాప సవ
పరిపాల వర మంత్ర గ్రహణ లోల
పరమ శాంత చిత్త జనకజాధిప
సరోజ భవ వరదాఖిల (జ)

చ5. సృష్టి-స్తిత్యంత కారకామిత
కామిత ఫలదాసమాన గాత్ర
శచీ పతి నుతాబ్ధి మద హరానురాగ
రాగ రాజిత కథా సార హిత (జ)

చ6. సజ్జన మానసాబ్ధి సుధాకర
కుసుమ విమాన సురసా రిపు కరాబ్జ
లాలిత చరణావ-గుణాసుర గణ
మద హరణ సనాతనాజ నుత (జ)

చ7. ఓంకార పంజర కీర పుర
హర సరోజ భవ కేశవాది
రూప వాసవ రిపు జనకాంతక కలా-
ధర కలా ధరాప్త ఘృణా కర
శరణాగత జన పాలన సు-మనో-
రమణ నిర్వికార నిగమ సారతర (జ)

చ8. కర ధృత శర జాలాసుర
మదాపహరణావనీ సుర సురావన
కవీన బిలజ మౌని కృత
చరిత్ర సన్నుత శ్రీత్యాగరాజ నుత (జ)

చ9. పురాణ పురుష నృవరాత్మజాశ్రిత
పరాధీన ఖర విరాధ రావణ
వి-రావణానఘ పరాశర మనో-
హరావికృత త్యాగరాజ సన్నుత (జ)

చ10. అగణిత గుణ కనక చేల
సాల విదళనారుణాభ సమాన
చరణాపార మహిమాద్భుత సు-కవి జన
హృత్సదన సుర ముని గణ విహిత
కలశ నీరధిజా రమణ పాప గజ
నృసింహ వర త్యాగరాజాది నుత (జ)